అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పరిచయం:

అనుపమ ఈ పేరు కి పరిచయం అక్కర్లేదు. అభిమానులకి కొదవ లేదు. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండియా లెవల్ లో పేరు ప్రఖ్యాతలు సాధించింది ఈ పేరు. ఈమె పూర్తి పేరు అనుపమ పరమేశ్వరన్. అనుపమ అంటే హిందూ దేవత పేరు. తన తండ్రి గారి పేరుని తన చివరి పేరుగా పెట్టుకొని అనుపమ పరమేశ్వరన్ అయ్యింది.

కుటుంబం (Family), పుట్టిన రోజు (Date Of Birth), వయస్సు (Age) మరియు చదువు (Education):

అనుపమ పరమేశ్వరన్ ఇరంజలకూడ ప్రాంతానికి చెందిన, పరమేశ్వరన్ మరియు సునీత దంపతులకు 18 Feb 1996 సంవత్సరం మొదటి సంతానంగా జన్మించింది. అనుపమ వయస్సు 23 సంవత్సరాలు. అనుపమ తమ్ముడి పేరు అక్షయ్ పరమేశ్వన్.

CMS కాలేజీ (కొట్టాయం) లో Communicative English చదువుని సినిమాల కోసం మధ్యలోనే ఆపేసింది మన అను.

సినిమా రంగం:

ఒక్క సినిమాతో ఇంతటి పేరు సాధించిన మన అను, ఆ సినిమాలో వున్నా హీరోయిన్లలో ఒకరు అంటే నమ్మగలరా! ఆ సినిమా మరేదో కాదు మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్. ఇందులో నటించిన సాయి పల్లవి మరియు మడన్న సెబాస్టియన్లకు కూడా చాలా మంచి పేరు వొచ్చింది.

ఈ సినిమానే నాగ చైతన్యతో అదే పేరుతో తెరకెక్కించి, మాతృకలో నటించిన పాత్రనే తెలుగు భాషలో కూడా నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రేమమ్ కంటే ముందు నితిన్ మరియు త్రివిక్రమ్ గారి సినిమా “అ ఆ” లో సమంతతో కలిసి నటించి తన మొదటి సినిమాగా తెలుగులో ప్రయాణం సాగించింది.

అభిమానులు:

అభిమానులు ముద్దుగా “అను”, “అను పాపా” అని పిలుచుకుంటారు. వారి అభిమానం ఎంతలాఉంటుందంటే సరదాగా ఒక మాట కూడా అంటుంటారు “అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం”.

Anupama Parameswaran Social Media:

అనుపమకి సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండడం చాలా ఇష్టం. తన అభిమానులకి ఎల్లప్పుడూ వినోదం పంచుతూ అందుబాటులో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. Instagram, Facebook, TikTok మరియు Twitter అంటూ అన్ని మాధ్యమాలలో ఎల్లప్పుడూ తన updates ఇస్తూ ఉంటుంది.

అవార్డులు:

అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు 4 బాషలలో 13 సినిమాలలో నటించింది. అనుపమ ఇప్పటివరకు మలయాళం, తమిళ్, తెలుగు మరియు కన్నడ భాషలలో తన అభినయాన్ని అందాన్ని చూపించి అవార్డులు కూడా గెలుచుకుంది.

 1. మొదటి సినిమాకే “11th Ramu Karyat Awards”  లలో “Most Popular Actress” అవార్డుని ప్రేమమ్ (మలయాళం) సినిమాతో గెలుచుకుంది. 
 2. అప్సర అవార్డు “అ ఆ” సినిమాకి గాను “Best Female Debut” అప్సర అవార్డుని గెలుచుకుంది. 
 3. ప్రేమమ్ (తెలుగు) కిగాను “Best Supporting Actress” అవార్డుని IIFA Utsavam లో గెలుచుకుంది.

అభిరుచులు:

Anupama-Parameswaran-Full-Details-and-Updates-FilmyGirls

ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ పాత్రకు ఒప్పుకొని అనుపమ ఇక మీదట కూడా ఇలానే ఉంటానని అలంటి పాత్రలు నాకు సరిపోవని, నేను ఇంట్లో వున్నప్పుడు మేకప్ కూడా వేసుకోనని సహజంగా ఉండడం నాకు చాలా ఇష్టం అని ఒక Interview లో చెప్పుకొచ్చింది.

పుకార్లు – గాసిప్స్:

అనుపమకు ఒక క్రికెటర్ కు మధ్య ప్రేమ ఉందని కొన్ని సోషల్ మీడియా మరియు టీవీలలో వొచ్చిన పుకార్లకు తను ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు. 

నటించిన సినిమాలు:

Anupama Parameswaran నటించిన సినిమాలు వరుసగా,

 1. Premam (2015) Malalyam Debut Movie
 2. James & Alice (2016) Malayalam
 3. A Aa (2016) Telugu Debut Movie
 4. Premam (2016) Telugu
 5. Kodi (2016) Tamil Debut Movie
 6. Sathamanam Bhavati (2017) Telugu
 7. Jomonte Suvisheshangal (2017) Malayalam
 8. Vunnadhi Okate Sindagi (2017) Telugu
 9. Krishnarjuna Yudham (2018) Telugu
 10. Tej I Love You (2018) Telugu
 11. Hello Guru Prema Kosame (2018) Telugu
 12. Natasaarvabhowma (2019) Kannada Debut Movie
 13. Rakshasudu (2019) Telugu
 14. Maniyarayile Ashokan (షూటింగ్ జరుగుతున్నది)

ఇతర కళలు:

అనుపమ పరమేశ్వరన్ తన కొత్తగా నటిస్తున్న మలయాళం సినిమా (Maniyarayile Ashokan) కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది.

రాక్షసుడు సినిమాకి తన స్వంత స్వరంతో తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది.

మరిన్ని అనుపమ పరమేశ్వరన్ విషయాలు మరియు సరికొత్త సంగతులకోసం FilmyGirls.com ని బుక్ మార్క్ చేసుకోండి. Helo, Facebook, Instagram, Pinterest and Twitter లలో ఫాలో అవ్వండి.